డీఎస్పీ అత్యుత్సాహం వల్ల తొక్కిసలాట..సీఎంకు నివేదిక..! 12 h ago
AP: తిరుపతిలో తొక్కిసలాట జరిగి పెనువిషాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటనపై సీఎం చంద్రబాబుకు అధికారులు నివేదిక సమర్పించారు. డీఎస్పీ అత్యుత్సాహం వల్ల ఒక్కసారిగా భక్తులు రావడంతో తొక్కిసలాట జరిగిందని పేర్కొన్నారు. అలాగే, అంబులెన్స్ వాహనాన్ని టికెట్ కౌంటర్ బయట పార్క్ చేసి డ్రైవర్ వెళ్లిపోయాడు. ఘటన జరిగిన 20 నిమిషాల పాటు డ్రైవర్ అందుబాటులోకి రాలేదు. డీఎస్పీ, అంబులెన్స్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే భక్తులు చనిపోయారని నివేదికలో వెల్లడించారు.